హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఓపిక లేకుంటే ఎలా?: తెలంగాణ మంత్రులపై గుత్తా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gutta Sukender Reddy
హైదరాబాద్: తెలంగాణ ప్రాంత మంత్రులపై పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి బుధవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ప్రజా ప్రతినిధులు ఇందిరాపార్కు వద్ద 48 గంటల నిరాహార దీక్షకు కూర్చున్న విషయం తెలిసిందే. అయితే వారికి మంత్రులు వచ్చి సంఘీభావం తెలిపి వెళ్లిపోవడంపై ఆయన ఆగ్రహం చెందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రులకు కనీసం 48 గంటలు కూర్చోవడానికి ఓపిక లేదా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆ మాత్రం చేయలేరా అని ప్రశ్నించారు. మంత్రులు ఇలా వచ్చి అలా సంఘీభావం తెలిపి వెళ్లిపోవడమేనా అని అన్నారు. ఇదేనా తెలంగాణపై చిత్తశుద్ధి అని అన్నారు.

తెలంగాణ కోసం రాజీనామా చేయని ప్రజాప్రతినిధులను ద్రోహులుగా ప్రకటించి వారి ఇళ్లముందు నిరసనలు తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు. పదవులు శాశ్వతం కాదని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణపై ఇప్పుడు అందరి ఏకాభిప్రాయం అడుగుతున్న కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్‌కు గతంలో ఇచ్చిన హామీ గుర్తుకు లేదా అని ప్రశ్నించారు. తెలంగాణను వ్యతిరేకిస్తున్న సీమాంధ్రులు ఎందుకు సమైక్యంగా ఉండాలో వివరించాలన్నారు. ఎందుకు విడిపోవాలో తాము చాలా వివరణలు ఇస్తామని చెప్పారు.

English summary
MP Gutta Sukhender Reddy fired at Telangana minister for their attitude. He suspected their stand on telangana. He blamed Ghulam Nabi Azad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X