వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ముంబైని ఇరాక్, అఫ్షాన్‌లతో పోల్చిన రాహుల్

ఉగ్రవాద దాడులను నిరోధించడానికి చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. తాము 99 శాతం దాడులను ఆపగలుగుతున్నామని, ఒక్క దాడిని ఆపడమే కష్టమవుతోందని ఆయన అన్నారు. వందశాతం దాడులను నిరోధించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ముంబై వరుస పేలుళ్లపై స్పందిస్తూ ఆయన ఆ విధంగా అన్నారు.
ముంబై పేలుళ్ల విషయంలో ప్రభుత్వం సరిగానే స్పందించిందని, పూర్తిగా వ్యవస్థీకృత పద్ధతిలో ప్రభుత్వం స్పందిస్తోందని ఆయన అన్నారు. ఉగ్రవాదులు దాడులకు ప్రయత్నించడం సర్వసాధారణమని, అయితే ఎన్నిటిని నిరోధించినా ఒక్క దాడిని నిరోధించలేకపోతున్నామని ఆయన అన్నారు. అమెరికాలోనూ ప్రతి రోజూ దాడులు జరుగుతున్నాయని ఆయన అన్నారు.