వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వైయస్ జగన్ ఆస్తులపై సిబిఐ దర్యాప్తు మొదలు

వైయస్ జగన్ ఆస్తులపైనే కాకుండా ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంపై దర్యాప్తు జరపాలని హైకోర్టు ఆదేశించింది. జగన్ ఆస్తుల విషయంలో ప్రాథమిక సాక్ష్యాలు లభ్యమైతే హైకోర్టు పూర్తి స్థాయి దర్యాప్తునకు కోర్టు సిబిఐని ఆదేశించే అవకాశాలున్నాయి. వైయస్ జగన్ ఆస్తులపై, ఆర్జనపై ప్రస్తుత మంత్రి శంకరరావు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు రాసిన ఓ లేఖను హైకోర్టు తనంతతానుగా విచారణకు స్వీకరించింది. ఈ కేసులో తెలుగుదేశం నాయకులు ఎర్రంనాయుడు, యనమల రామకృష్ణుడు, బైరెడ్డి రాజశేఖర రెడ్డి, న్యాయవాది షేర్వాణి ఇంప్లీడ్ అయ్యారు.