శబమరిమల: నటి జయమాలకు కోర్టు సమన్లు

తాను 1987లో శబరిమల దేవుడిని తాకానని చెప్పిన జయమాల మాటలపై వివాదం చెలరేగడంతో, అది ఆలయ సంప్రదాయాలకు విరుద్ధమని ఆరోపిస్తూ కేరళ నేరపరిశోధన విభాగం పోలీసులు నిరుడు డిసెంబర్‌లో దర్యాప్తు చేపట్టారు. రసజ్వల కానీ ఆడపిల్లలు, మెనోపాజ్‌కు చేరుకున్న మహిళలు మాత్రమే తనను ఆలయంలోకి ప్రవేశించాలని అయ్యప్ప ఆదేశించినట్లు చెబుతారు. ఇతర మహిళలు ఆలయంలోకి ప్రవేశించడం ఆలయ సంప్రదాయాలకు విరుద్ధమని చెబుతారు. దీంతో జయమాల ఆలయంలోకి ప్రవేశించడంపై 2006లో తీవ్ర వివాదం చెలరేగింది.
ఆ వివాదంపై దర్యాప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది. నిందితులు కావాలని ఆలయ సంప్రదాయాలను ఉల్లంఘించి భక్తుల మనోభావాలను దెబ్బ తీశారని చార్జిషీట్ దాఖలైంది .












Click it and Unblock the Notifications