విశాఖపట్నం: సీమాంధ్ర ప్రజా ప్రతినిధులకు ఆంధ్రా విశ్వవిద్యాలయ ఐక్య కార్యాచరణ సమితి హెచ్చరికలు జారీ చేసింది. సమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర ప్రజాప్రతినిధులు అందరూ కేంద్రంపై ఇరవై నాలుగు గంటల్లో ఒత్తిడి తీసుకు రావాలని డిమాండ్ చేశారు. లేదంటే సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కేంద్రం తెలంగాణ రాష్ట్రం ప్రకటించే పరిస్థితులు ఎదురైతే సీమాంధ్ర ప్రజాప్రతినిధులు వెంటనే రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు.
అంతకుముందు విద్యార్థి ఐక్య కార్యాచరణ సమితి స్థానిక పౌర గ్రంథాలయంలో భేటీ అయ్యారు. ఉద్యమ కార్యాచరణపై చర్చించారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో అందరితో పాటు విద్యార్థులు పాల్గొంటారని నిర్ణయించారు. కాగా విశాఖపట్నం జిల్లాలో శాసనసభ్యుడు విజయ్ కుమార్ ఇంటిని పలువురు విద్యార్థులు ముట్టడించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.