బాబు చర్చలు: ఎర్రబెల్లి, మోత్కుపల్లి మధ్య సయోధ్య

రాజీనామాలను ఆమోదించాలని కోరడానికి వారు శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కలిసిన తర్వాత మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణ కోసం తాము ఎంతటి త్యాగాలకైనా సిద్ధమని టిడిపి తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర రావు చెప్పారు. అన్ని వర్గాలతో చర్చించి భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకుంటామని ఆయన చెప్పారు. రాజీనామాల ఆమోదంపై వేచి చూస్తామని ఆయన చెప్పారు. తమ రాజీనామాలను ఆమోదింపజేసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని, మిగతా పార్టీలవారు కూడా అందుకు సిద్ధపడాలని మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. రాజకీయ సంక్షోభం సృష్టిస్తేనే తెలంగాణ వస్తుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications