జగన్‌పై విచారణ, మరో నాలుగింటికి సిబిఐ నోటీసులు

ఏడు సంస్థల యజమానులు, న్యాయనిపుణులు సిబిఐ ముందు హాజరై వివరాలు అందించారు. తమ వాదనను వినిపించారు. విదేశీ మారక ద్రవ్యం నిబంధనల ఉల్లంఘన జరిగిందా అనే విషయంపై దర్యాప్తు చేయడానికి సిబిఐ బృందం ఒక్కటి విదేశాలకు వెళ్లినట్లు సమాచారం. పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని లక్ష్మినారాయణ చెప్పారు. సంస్థల ప్రతినిధులు రాతపూర్వకమైన వివరాలను సిబిఐకి అందించారు. ముంబై నుంచి జరిగిన ఆర్థిక లావాదేవీలపై కూడా సిబిఐ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. వైయస్ జగన్ సంస్థల్లోకి ఏ విధంగా పెట్టుబడులు వచ్చి చేరాయనే అంశంపై సిబిఐ విచారణ జరుపుతోంది. ప్రభుత్వాధికారుల నుంచి కూడా సిబిఐ వివరాలు సేకరించింది.
జగన్ ఆస్తులపై ప్రాథమిక విచారణ జరిపి రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని హైకోర్టు సిబిఐని ఆదేశించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సిబిఐ వైయస్ జగన్ సంస్థల్లో పట్టుబడులు పెట్టిన సంస్థలకు, జగన్ సంస్థలకు మొత్తం పదిహేనంటికి సిబిఐ నోటీసులు జారీ చేసింది. మరిన్ని సంస్థలకు సిబిఐ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications