చారిత్రాత్మక గూర్ఖాలాండ్ ఒప్పందంపై సంతకాలు

కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మోర్చా చీఫ్ బిమల్ గురుంగ్ సమక్షంలో సంతకాలు చేయడానికి సర్వాంగ సుందరమైన ఉత్సవాన్ని నిర్వహించారు. జిటిఎకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి సహకారం అందిస్తాయని చిదంబరం, మమతా హామీ ఇచ్చారు. ఈ పర్వత ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 600 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. 1988లో ఏర్పడిన డార్జిలింగ్ గూర్ఖా హిల్ కౌన్సిల్‌కు ఇచ్చిన అధికారాల కన్నా ఎక్కువ అధికారాలను దారాదత్తం చేస్తున్నారు.
గూర్ఖాలాండ్ ప్రాదేశిక యంత్రాంగానికి (జిటిఎకు) పర్యాటక, వ్యవసాయ, ప్రజారోగ్య రంగాలపై నియంత్రణ ఉంటుంది. గ్రూపు బి, సి, డి ఉద్యోగుల నియామానికి కూడా దానికి అధికారాలుంటాయి. ఎ గ్రూపు ఉద్యోగులను ఇందులో చేర్చలేదు. పాఠశాల, కళాశాల అధ్యాపకుల కమిషన్లపై పూర్తి నియంత్రణ ఉంటుంది. ఈ ఒప్పందంతో గూర్ఖాలాండ్ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు డిమాండుకు తెర వేశారు.












Click it and Unblock the Notifications