తెలంగాణపై బ్లాక్ మెయిల్‌కు లొంగకండి: కావూరి లేఖ

అధిష్టానం ఏ అంశంపైన చర్చకు పిలిచినా వెళ్లేందుకు సీమాంధ్ర ప్రజా ప్రతినిధులం సిద్ధంగా ఉన్నామని మంత్రి శైలజానాథ్ వేరుగా చెప్పారు. కొందరి బ్లాక్ మెయిల్ కారణంగా రాష్ట్రం ఏర్పడదన్నారు. సమైక్యాంధ్ర ఆవశ్యకత అధిష్టానానికి వివరిస్తామని చెప్పారు. కెసిఆర్ వ్యాఖ్యలు తాను పట్టించుకోనని అన్నారు. అధిష్టానం పిలిస్తే తెలంగాణ, సీమాంధ్ర నేతలు ఒకే వేదికపై చర్చకు సిద్ధమని చెప్పారు. శ్రీకృష్ణ కమిటీలోని 6వ ప్రతిపాదన వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ నేతలతో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి టిజి వెంకటేష్ చెప్పారు. కెసిఆర్ మాట్లాడే ప్రతి వ్యాఖ్యలకు కామెంట్ చేయాల్సిన అవసరం లేదన్నారు.












Click it and Unblock the Notifications