హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టిజి వెంకటేష్‌పై ధ్వజమెత్తిన మధు యాష్కీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Madhu Yashki
హైదరాబాద్: మంత్రి టిజి వెంకటేష్‌కు దమ్ముంటే సీమాంధ్ర సేనకు వెనక్కి తగ్గకూడదని ఆయన సేనను ఏర్పాటు చేస్తే తాము నిజాం ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నట్టు ఆయన సేనను ఎదుర్కొంటామని నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ సోమవారం ధ్వజమెత్తారు. సోమవారం ఎంపీ మంద జగన్నాధం ఇంట్లో టి-కాంగ్రెసు నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యాష్కీ మాట్లాడారు. టిజి వెంకటేష్ ఓ కెడి అన్నారు. ఆయన సైన్యాన్ని ఏర్పాటు చేస్తే మా సత్తా చూపిస్తామన్నారు. మాజీ మంత్రి రేణుకా చౌదరికి దమ్ముంటే తాను సమైక్య వాదినని ప్రకటించాలని డిమాండ్ చేశారు. దళితులను అణిచి వేయాలని తెలంగాణ కాంగ్రెసు చూడటం లేదన్నారు. తెలంగాణ కోసం పోరాడితే దళితులే ముఖ్యమంత్రి కావచ్చునని అన్నారు.

తెలంగాణపై స్పష్టమైన వైఖరి కేంద్రం స్పష్టం చేసే వరకు రాజీనామాలు ఉపసంహరించుకునే ప్రసక్తి లేదని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. రాజీనామాలు ఆమోదిస్తే కేంద్రానికి మన బలం చూపెట్టవలసి ఉంటుందన్నారు. తెలంగాణ కోటా కింద కొందరు పదవులు దక్కించుకున్నారని వారు ఇప్పుడు ఉద్యమంలో పాల్గొనడం లేదని ఆరోపించారు. కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ రాష్ట్రానికి ఇంచార్జా ఆంధ్రా వాళ్లకా అని ఎమ్మెల్యే కెఎల్ఆర్ ప్రశ్నించారు. తెలంగాణ కోసం ఎంతకైనా తెగిస్తామని హెచ్చరించారు. హైదరాబాదులోని ఆంధ్రా వాళ్లకు నీళ్లు బంద్ చేసి చెత్త తీయడం మానేద్దామని సూచించారు. సూడాన్ తరహాలో నూటికి నూరుపాళ్లు తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోరుకుంటున్నారని మంత్రి జానారెడ్డి అన్నారు.

పది రోజుల్లో కేంద్రం తెలంగాణ ఇస్తానని మాట ఇస్తే ఢిల్లీ వెళతామని ఎంపీ పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఆజాద్ తన మాటలను వెనక్కి తీసుకున్న పక్షంలో చర్చలకు సిద్దమని చెప్పారు. ఢిల్లీ వెళ్లినా తెలంగాణ తప్ప దేనికీ ఒప్పుకునే ప్రసక్తి లేదన్నారు. తెలంగాణ సాధన కోసం సీమాంధ్ర ఆర్థిక మూలాలు దెబ్బ తీయాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో సినిమాలు చూడవద్దని సూచించారు. రాజీవ్ రహదారి విస్తరణ పనులు అడ్డుకోవాలని సూచించారు. తెలంగాణ ఇప్పుడు రాకుంటే మరెప్పుడూ రాదని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి అన్నారు. 200 మంది సీమాంధ్ర ప్రజా ప్రతినిధుల స్వార్థం ముఖ్యమా, నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆవేదన ముఖ్యమా అని అధిష్టానాన్ని ప్రశ్నించారు. తెలంగణ ఇవ్వకుంటే పరిపాలన స్తంభింప చేయడానికి సిద్ధమన్నారు. రాస్తారోకోలు చేపడతామని హెచ్చరించారు.

తెలంగాణ సాధన కోసం ఈ నెల 20న మున్సిపల్ స్థాయిలో సామూహిక నిరాహార దీక్షలు కాంగ్రెసు చేపడుతుందని రాజ్య సభ సభ్యుడు కె కేశవరావు చెప్పారు. 26న జెండా పండుగ నిర్వహిస్తామన్నారు. కాంగ్రెసు జెండాలో తెలంగాణ జెండా ఉంచి ఎగుర వేయాలని సూచించారు. తెలంగాణపై ఎలాంటి రాజీ పడే ప్రసక్తి లేదన్నారు. వచ్చిన అవకాశాన్ని వదులుకునే ప్రసక్తి లేదన్నారు. టి-కాంగ్రెసులో ఎలాంటి విభేదాలు లేవన్నారు. కాంగ్రెసుకు గ్రామీణ కార్యకర్తలే బలం అని వారు పట్టుగా ఉంటే తెలంగాణ సాధ్యమన్నారు.

English summary
MP Madhu Yashki blamed TG Venkatesh today. He warned him on Seemandhra Sena. T-Congress leaders demanded Ghulam Nabi Azad that to with draw his comments on Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X