కెసిఆర్, కోదండరామ్‌కు చెక్ పెట్టేందుకు కొత్త జెఏసి

టిఆర్ఎస్‌తో ఎలాగు టిడిపి కలిసి పని చేయదు. ఒకవేళ కలిసి పని చేసినప్పటికీ కెసిఆర్ పెత్తనమే చెల్లుతుంది. ఇక కాంగ్రెసు, బిజెపిలు ఎలాగూ టిడిపితో పని చేయడానికి సిద్ధం లేమని స్పష్టం చేశాయి. దీంతో తామే ఓ జెఏసిని తెలంగాణ కోసం ఏర్పాటు చేయాలనే విధంగా పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తోంది. బస్సు యాత్రకు మద్దతు పలికిన గద్దర్, విమలక్క తదితరులను కలుపుకొని వెళ్లాలని యోచిస్తున్నట్లుగా సమాచారం. కెసిఆర్ ఒంటెత్తు పోకడలను చాలామంది వ్యతిరేకిస్తున్నారు. వారందరినీ కూడగట్టే ప్రయత్నాలు టిడిపి తెలంగాణ ఫోరం చేసి ముందుకు వెళ్లేందుకు సిద్దమవుతున్నట్లుగా తెలుస్తోంది. టిడిపి తెలంగాణ ఫోరం సోమవారం హైదరాబాదులో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోనున్నట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications