వైయస్ జగన్‌పై దుమ్మెత్తిపోసిన పయ్యావుల కేశవ్

Payyavula Keshav
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ దుమ్మెత్తిపోశారు. కాంగ్రెసుతో తెలుగుదేశం పార్టీ కుమ్మక్కయిందని వైయస్ జగన్ చేసిన విమర్శపై, సిబిఐ విచారణకు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై జగన్ సుప్రీంకోర్టుకు వెళ్లడంపై ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా ప్రతిస్పందించారు. సిబిఐ విచారణకు హైకోర్టు ఆదేశాలను నిలిపేయాలని కోరుతూ సుప్రీంకోర్టుకు వెళ్లడం వల్ల జగన్‌పై ప్రజల్లోకి అనుమానాలు కలుగుతున్నాయని ఆయన అన్నారు. నిజాయితీని, సచ్చీలతను నిరూపించుకోవడానికి జగన్ తనపై వచ్చిన ఆరోపణల మీద ఏ సంస్థతో విచారణకు సిద్ధపడతారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

వైయస్ జగన్‌కు హైకోర్టు మీద విశ్వాసం లేదా అని ఆయన అడిగారు. సిబిఐని తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కాంగ్రెసు బ్యూరో ఆఫ్ కాంగ్రెసు అన్న మాట వాస్తవమేనని, అయితే ప్రభుత్వ ఆధ్వర్వంలో జరిగే విచారణలకు ప్రభుత్వం నుంచి ఒత్తిళ్లు ఉంటాయని, జగన్‌పై హైకోర్టు నేతృత్వంలో విచారణ జరుగుతోందని, దీనివల్ల కొంత మేరకైనా న్యాయం జరుగుతుందనేది తమ విశ్వాసమని ఆయన వివరించారు. తమ పార్టీ కాంగ్రెసుతో కుమ్మక్కయిందనే జగన్ విమర్శను ఆయన తిప్పికొట్టారు. కుమ్మక్కయ్యే చరిత్ర వైయస్ రాజశేఖర రెడ్డికి, ఆయన వారసుడు వైయస్ జగన్‌ది అని కేశవ్ వ్యాఖ్యానించారు.

వైయస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెసు, ప్రజారాజ్యం, తెలుగుదేశం పార్టీల శాసనసభ్యులతో కుమ్మక్కయ్యారని, వెనక నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో కుమ్మక్కయ్యారని ఆయన అన్నారు. తాను కుమ్మక్కు కావడం వల్ల జగన్‌కు అందరూ అలాగే కనిపిస్తున్నారని, జగన్ తన ఆలోచనను మార్చుకోవాలని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+