రండి చూసుకుందాం: పయ్యావులపై నాగం ధ్వజం

కాంగ్రెసు చేస్తే తాము చేస్తామని అనడానికి టిడిపి సోనియాగాంధీ అనుబంధ సంస్థనా అని ప్రశ్నించారు. పయ్యావుల వ్యాఖ్యలపై చంద్రబాబు, ఎర్రబెల్లి దయాకర రావు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. తెలంగాణ టిడిపి నేతలు సీమాంధ్ర నేతలకు తొత్తులుగా ఉంటూ ఇంకా పార్టీని వీడి బయటకు రావడం లేదన్నారు. సిగ్గు లేకుండా పార్టీని పట్టుకొని వేలాడుతున్నారన్నారు. టిడిపి నేతలు బస్సు యాత్ర, పాదయాత్ర అంటూ నాటకాలు మాని పార్టీ వీడాలని సూచించారు.
ఆత్మహుతి దాడులకు పాల్పడతానన్న సీమాంధ్రులు రావాలని వారి సంగతి చూస్తానని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలను పయ్యావుల రెచ్చగొడుతున్నారన్నారు. పార్లమెంటు భవనం సమీపంలోని పార్కులో రంగారెడ్డి జిల్లాకు చెందిన యాదిరెడ్డి ఆత్మహత్యలో మొదటి ముద్దాయి కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ, రెండో ముద్దాయి కాంగ్రెసు, మూడో ముద్దాయి చంద్రబాబు నాయుడు అని అన్నారు. రాజీనామా చేసిన ప్రజాప్రతినిధులు 48 గంటల్లో తమ రాజీనామాలు ఆమోదింప జేసుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications