మదురైలో బాలుడిపై అత్యాచారం, నలుగురి అరెస్టు

పోలీసుల కధనం మేరకు, జూలై 16న, వీరు పి. జయసూర్య (8) అనే బాలుడ్ని సాయంత్రం 4 గంటల వేళ స్నేహితులతో ఆడుకోడం గమనించారు. అంతే, జయసూర్యను ఎత్తుకొని తీసుకుపోయి స్కూల్ బాత్ రూమ్ లో అత్యాచారం చేశారు. హఠాత్ సంఘటనకు గురైన బాలుడు స్పృహ తప్పాడు. వారు చేసిన తప్పును బయట పెడతాడని భావించిన ఈ అయిదుగురు బాలుడిని గొంతు నులిమి చంపేశారు. శవాన్ని అక్కడే వున్న ఒక చెక్కపెట్టెలో పడేశారు. నిందితులు గత రెండేళ్ళనుండి కలిసి మద్యం సేవించడం, పొగతాగటం వంటివి చేస్తున్నారని, వారిని హత్య, అసాధారణ సెక్సు కేసుల కింద బుక్ చేశామని పోలీసులు తెలుపుతున్నారు.
పిల్లలకు ఈ రోజులలో మీడియా ద్వారా అందుతున్నసెక్స్ సమాచారమే ఈ సంఘటనకు కారణంగా మానసిక వేత్తలు చెపుతున్నారు. అభం, శుభం తెలియని ఈ వయసు పిల్లలు మీడియా చేస్తున్న అతి ప్రచారానికి తలొగ్గుతున్నారంటున్నారు. పిల్లలు ప్రత్యేకించి ఒక గ్రూపుగా ఏర్పడితే వారి ప్రవర్తన అనూహ్యంగా వుంటుందని, పెంపకం కారణం కూడా వుంటుందని ఎన్ షాలిని అనే మానసిక నిపుణురాలు తెలిపారు. నేరం చేసిన పిల్లలు మొదట్లో ఒప్పుకోకపోయినా, గట్టిగా ప్రశ్నలు వేసేటప్పటికి తాము చేసిన తప్పు అంగీకరించారని పోలీసులు తెలిపారు.
పిల్లలకు సరి అయిన కౌన్సెలింగ్ చేయాలని వారి ప్రవర్తనలో మార్పు తీసుకు రావాలని షాలిని చెపుతారు. పోలీసులు స్కూలు విద్యార్ధులను బాల నేరస్ధుల జైలుకు, వారికి సహకరించిన శ్రామికుడిని మేలూర్ సబ్ జైలుకు పంపారు.












Click it and Unblock the Notifications