జగన్‌కు సుప్రీంలో షాక్: సిబిఐ దర్యాప్తు కొనసాగింపు

జస్టిస్ దల్వీర్ బండారి, జస్టిస్ దీపక్ వర్మలతో కూడిన నాలుగో కోర్టు శుక్రవారం స్టే విధించడానికి నిరాకరించింది. దర్యాఫ్తు చేయడానికి హైకోర్టుకు పూర్తి అధికారాలు ఉన్నాయని చెప్పింది. హైకోర్టు దర్యాఫ్తు తర్వాత సంతృప్తిగా లేకుంటే సుప్రీం కోర్టుకు రావచ్చని సూచించింది. హైకోర్టు ఇచ్చింది కేవలం మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే అని సిబిఐ ప్రాథమిక విచారణ మాత్రమే చేస్తోందని చెప్పింది. హైకోర్టు ఉత్తర్వులపై ఈ సమయంలో జోక్యం చేసుకోవడం కుదరదని చెప్పింది. సిబిఐ నివేదికను ప్రతివాదులకు కూడా అందించి వారి సమాధానం అడగాలనిహైకోర్టుకు సూచించింది. జగన్ పిటిషన్‌పై విచారణను అంతకు ముందు సుప్రీంకోర్టు మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేసింది.
వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి ఎప్పుడూ రాలేదని అలాంటప్పుడు ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశమే లేదని శుక్రవారం ఉదయం జగతి పబ్లికేషన్స్ తరఫున వాదిస్తున్న ముకుల్ వోరా కోర్టులో వాదించారు. జస్టిస్ దల్వీర్ బండారి, జస్టిస్ దీపక్ వర్మలతో కూడిన నాలుగో కోర్టుల వైయస్ జగన్ కంపెనీలలో పెట్టుబడులపై విచారణపై వాదనలు సాగాయి. మధ్యాహ్నం కాసేపు వాదనలు అయ్యాక విచారణను రెండు గంటలకు వాయిదా వేశారు. జగన్‌పై కోర్టుకు వెళ్లినవారికి రాజకీయ ప్రయోజనం తప్పితే ప్రజాప్రయోజనం లేదన్నారు. జగన్ ఎప్పుడూ అధికారంలో లేడని చెప్పారు.












Click it and Unblock the Notifications