వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పాపం...ప్రమాదంలో మాంసపు ముద్దలయ్యారు

శుక్రవారం తెల్లవారుజామున భీజింగ్ - ఘుహై ఎక్స్ ప్రెస్ వేపై 47 ప్యాజింజర్లతో కూడిన ఒక డబుల్ టెక్కర్ బస్సు వెళుతోంది.. ఏం జరిగింతో తెలియదు ఒక్కసారిగా బస్సులు మంటలు చెలరేగాయి. తప్పించుకునే మార్గం లేకుండా సెకన్లలో చట్టుముట్టిన మంటలు 41 మందిని బలిగొన్నాయని అధికారి ఘూంగ్ గొహై చెప్పారు. మిగిలిన 7గురు గాయాలతో బయట పడ్డారని, అందులో ఒకరి పరిస్థితి ఆందోళణకరంగా ఉందని గొహై వెల్లడించారు. 35 మంది ప్రయాణించేందుకు మాత్రమే సామర్ధ్యమున్న ఈ బస్సులో 47 మందికి ఎక్కించారని ఆయన వివరించారు. అగ్నికి అహుతైన మృత దేహాలు గుర్తు పట్టలేని రీతిలో ఉండటంతో డీఎన్ఏ పరీక్షలు నిర్వహంచి వారి వివరాలు సేకరిస్తామని పోలీసులు వెల్లడించారు.