హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విహెచ్ హైదరాబాద్ ప్రతిపాదన అధిష్టానం మాటేనా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

V Hanumanth Rao
హైదరాబాద్: రాజధాని హైదరాబాదును మరో పదేళ్ల వరకు ఉమ్మడి రాజధానిగా ఉంచేందుకు సిద్ధంగా ఉన్నామని ఆ తర్వాతనైనా సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు వెళ్లి పోవాలని కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు చెప్పి కొత్త వాదానికి తెర తీశారు. హైదరాబాదును రాష్ట్రంలోని అందరు కలిసి అభివృద్ధి చేశారని అది ఏ ఒక్కరి సొత్తో కాదని సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ఇన్నాళ్లూ చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో హనుమంత రావు పదేళ్లు హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా ఉంచేందుకు సిద్ధమని చెప్పడం ద్వారా కొత్త వాదానికి తెర తీశారు. పలువురు సీమాంధ్రులు సైతం ఈ వాదనను ఎప్పుడో తెరమీదకు తీసుకు వచ్చారు. కానీ తెలంగాణ ప్రజాప్రతినిధులు మాత్రం దానికి ససేమీరా అన్నారు. హైదరాబాదుతో కలిసిన తెలంగాణ రాష్ట్రం ఖచ్చితంగా ఏర్పడాల్సిందే అని వాదిస్తూ వచ్చారు.

సీమాంధ్రులు ప్రతిపాదించినప్పుడే దీనికి ఒప్పుకొని ఉంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా నాలుగైదేళ్లు గడిచి పోయేది. కానీ ఉమ్మడి రాజధానికి ససేమీరా అన్న తెలంగాణ ప్రజాప్రతినిధులు ఇప్పుడు అదే విషయాన్ని తెరపైకి తీసుకు రావడం వెనుక ఆ పార్టీ అధిష్టానం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. తెలంగాణ కోసం టి-కాంగ్రెసు ప్రజాప్రతినిధులు అందరూ రాజీనామా చేసినప్పటికీ విహెచ్ చేయలేదు. తాను తెలంగాణకు కట్టుబడి ఉన్నానని, అయితే అధిష్టానాన్ని ఒప్పించి తెలంగాణ సాధిస్తామని చెప్పారు. విహెచ్ అధిష్టానానికి చాలా దగ్గర కావటం వల్ల తన మాటను ఆయనతో అధిష్టానం చెప్పించి ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇటీవల న్యూఢిల్లీ పర్యటనలోనే పదేళ్లు ఉమ్మడి రాజధాని ప్రతిపాదన వచ్చినట్లుగా భావిస్తున్నారు.

అయితే అప్పుడే బహిర్గతం చేస్తే టి-కాంగ్రెసు అధిష్టానం ఒత్తిడికి లొంగిపోయిందనే ఆరోపణలు వెలువడుతాయనే ఉద్దేశ్యంతోనే కాస్త ఆలస్యంగా ఇప్పుడు బహిర్గతం చేసినట్లు పలువురు భావిస్తున్నారు. ఉమ్మడి రాజధాని ప్రతిపాదన ద్వారా ఇటు తెలంగాణలో కాస్త వాతావరణాన్ని చల్లబర్చడమే కాకుండా, సీమాంధ్రులలో ఉన్న అభిప్రాయాలు సైతం బహిర్గతమయ్యే అవకాశం ఉందని అధిష్టానం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఉమ్మడి రాజధాని అంటే ఇటు సీమాంధ్రులు, అటు తెలంగాణవాదులు ఎలా స్పందిస్తారో చూడాలనే ఉద్దేశ్యంతోనే విహెచ్‌తో ఆ ప్రతిపాదన బహిర్గతం చేసినట్లుగా కనిపిస్తోంది. ఒకవేళ ఇటు సీమాంధ్ర, అటు తెలంగాణ నుండి ఈ ప్రతిపాదనకు సానుకూల సంకేతాలు వస్తే ఆ విధంగా ముందుకు వెళ్లేందుకు అధిష్టానం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

English summary
It seems, Congress party MP V Hanumantha Rao opened high command's decision on joint capital proposal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X