వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పకు మూడినట్లే?

By Pratap
|
Google Oneindia TeluguNews

BS Yeddyurappa
బెంగళూరు: గనుల అక్రమ తవ్వకాలపై లోకాయుక్త తప్పు పట్టడంతో కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పకు కష్టకాలం మొదలైనట్లు చెబుతున్నారు. పరువును కాపాడుకునేందుకు రాష్ట్రంలో నాయకత్వ మార్పునకు బిజెపి అధిష్టానం ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గనుల అక్రమాలపై లోకాయుక్త నివేదిక వెలువడగానే దానిపై తన అభిప్రాయాన్ని రాష్ట్రపతికి నివేదిస్తానని కర్ణాటక గవర్నర్‌ హెచ్‌.ఆర్‌.భరద్వాజ్‌ విస్పష్టంగా ప్రకటించారు. ''ఆ విషయాలు (గనుల నివేదిక) వెలువడనివ్వండి. అప్పుడు నా అభిప్రాయాన్ని రాష్ట్రపతికి పంపిస్తా. అది మాత్రం మీడియాకు లీకవదు'' అని భరద్వాజ్‌ ఆదివారం మీడియాతో చెప్పారు. నివేదిక బుధవారంలోగా ఎప్పుడైనా సమర్పించే అవకాశాలు ఉండటంతో గవర్నర్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

లోకాయుక్త జస్టిస్‌ సంతోష్‌హెగ్డే కోరితే తప్ప ఫోన్‌ ట్యాపింగ్‌ వివాదంలో కల్పించుకోబోనని భరద్వాజ్‌ స్పష్టం చేశారు. ''ఆయన్ను ప్రభావితం చేయాలనుకున్న లేదా ఫోన్‌ ట్యాపింగ్‌కు ప్రయత్నించిన వారు బాధ్యతాయుతమైన వ్యక్తులు. టెలిఫోన్‌ ట్యాపింగ్‌కు మీరు, నేను పాల్పడలేదు. కాబట్టి ఆ వ్యవహారంలో నాకెలాంటి పాత్ర లేదు'' అని భరద్వాజ్‌ చెప్పారు. మరోవైపు ఫోన్‌ ట్యాపింగ్‌పై విచారణకు ఆదేశించలేదని ప్రభుత్వం తెలిపింది.

కాగా, తాను పదవి నుంచి వైదొలగనని, సోమవారం రాష్ట్రానికి రాగానే విలేకర్ల సమావేశం ఏర్పాటు చేస్తానని యడ్యూరప్ప మారిషస్‌ నుంచి ఓ ఛానల్‌కు తెలిపారు. నివేదికలోని అంశాలను బహిర్గతం చేస్తున్న లోకాయుక్త జస్టిస్‌ సంతోష్‌హెగ్డేపై చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రిని కోరనున్నట్లు చెప్పారు. గనుల తవ్వకాలు, వాటికి అనుమతులు ఇచ్చే విషయంలో తానెలాంటి తప్పు చేయలేదని సమర్థించుకున్నారు. గనుల శాఖ ముఖ్యమంత్రి వద్దే ఉన్నందున అక్రమ గనుల తవ్వకాలకు సంబంధించి ఆయనే బాధ్యత వహించాల్సి ఉంటుందని లోకాయుక్త జస్టిస్‌ సంతోష్‌హెగ్డే స్పష్టం చేశారు. ఆదివారం బెంగళూరులో ఓ ప్రైవేటు వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పై విధంగా స్పందించారు.

English summary
As Lokayukta indicts, Karnataka CM Yeddyurappa is in trouble. BJP high command is thinking about leadership change in Karnataka, it is said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X