మళ్లీ రాజీనామాలు చేసిన టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు

కాగా తెలంగాణ ప్రజా ప్రతినిధులు అందరూ మరోసారి రాజీనామా చేయాలని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ సోమవారం పిలుపునిచ్చారు. అందరూ రాజీనామాలు చేయాలని రాజీనామాలు చేయడానికి ఆగస్టు 1వ తేదిని డెడ్ లైనుగా పెట్టారు. ఆ లోపు రాజీనామాలు చేయని వారితో ఎలా చేయించాలో కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. రాజీనామాలు చేసిన వారి వెంట జెఏసి ఉంటుందని చెప్పారు. బుధవారం జెఏసి న్యూఢిల్లీ వెళ్లి వివిధ పార్టీల మద్దతును కూడగడుతుందని చెప్పారు. ప్రధాన ప్రతిపక్షమైన బిజెపిని కలిసి తమ సకల జనుల సమ్మెకు, పార్లమెంటులో బిల్లు పెట్టడానికి మద్దతు ఇవ్వాలని కోరతామని చెప్పారు. మంగళవారం 130 ఎన్జీవో సంఘాలతో భేటీ అవుతున్నట్టు చెప్పారు.












Click it and Unblock the Notifications