బెంగళూర్: ప్రధాని మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో పలువురు అవినీతిపరులున్నారని, ముందు ప్రధాని రాజీనామా చేయాలని కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప అన్నారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి ఆయన నిరాకరిస్తున్నారు. ప్రధాని నిజాయితీపరుడే అయినా చుట్టూ ఉన్నవారంతా అవినీతిపరులని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. అందువల్ల ప్రధాని రాజీనామా చేసి, ఆ తర్వాతనే తమను అడగాలని ఆయన అన్నారు. తాను మరో రెండేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉంటానని, బిజెపి మరో 20 ఏళ్లు అధికారంలో ఉంటుందని ఆయన అన్నారు.
ఇదిలా వుండగా, లోకాయుక్త సంతోష్ హెగ్డే బుధవారం తన నివేదికను సమర్పించనున్నారు. రాష్టంలో అక్రమ మైనింగ్‌పై ఆయన ఈ నివేదికను ఆయన రూపొందించారు. అక్రమ మైనింగ్‌లో యడ్యూరప్ప పాత్ర ఉందని లోకాయుక్త ఎత్తిచూపినట్లు వార్తలు రావడంతో దుమారం చెలరేగడం ప్రారంభమైంది. కాగా, నివేదిక వచ్చిన తర్వాత యడ్యూరప్పను ముఖ్యమంత్రి పీఠం నుంచి దింపాలని బిజెపి అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి పీఠం కోసం పలువురు నాయకులు పోటీ పడుతున్నారు.
Still defiant and refusing to quit, Karnataka Chief Minister BS Yeddyurappa today said, "Let the PM resign first as many ministers in his Cabinet are corrupt."
Story first published: Tuesday, July 26, 2011, 19:20 [IST]