జగన్ ఆస్తులపై విచారణ ఎందుకు చేయొద్దు: హైకోర్టు

High Court
హైదరాబాద్: వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులపై సిబిఐ విచారణకు ఎందుకు ఆదేశాలు జారీ చేయకూడదో చెప్పాలని హైకోర్టు జగన్ తరఫు న్యాయవాదిని బుధవారం ప్రశ్నించింది. జగన్ ఆస్తులపై ఉదయం వాదనలు ప్రారంభమయ్యాయి. సిబిఐ ప్రాథమిక విచారణను పరిగణలోకి తీసుకున్న కోర్టు విచారణకు ఎందుకు ఆదేశించకూడదో వివరించాలని ప్రశ్నించారు. విచారణకు సిబిఐ ఐజి లక్మీనారాయణ హాజరయ్యారు. సిబిఐ ప్రాథమిక విచారణ కాపీని తమకు ఇవ్వాల్సిందిగా జగన్ తరఫు న్యాయవాదిని కోర్టును కోరారు. కాగా వాదనల అనంతరం కేసును కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. సిబిఐ ప్రాథమిక నివేదికను ఇవ్వాలని జగన్ తరఫు న్యాయవాది కోరగా, తామే ఇంకా తెరవలేదని న్యాయమూర్తులు సీల్డ్ కవర్‌ను చూపించారు. సీల్డ్ కవర్ తెరవబోమని, ప్రతివాదులకు ఇవ్వబోమని హైకోర్టు తేల్చి చెప్పింది.

కాగా మంత్రి శంకర్ రావు, తెలుగుదేశం పార్టీ నేతలు రాజశేఖర రెడ్డి, ఎర్రన్నాయుడు లేఖలను పరిగణలోకి తీసుకొని హైకోర్టు పదిహేను రోజుల క్రితం సిబిఐ ప్రాథమిక దర్యాఫ్తుకు ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రాథమిక దర్యాఫ్తులో అక్రమ ఆస్తులు ఉన్నట్లు తేలితే పూర్తి విచారణకు ఆదేశించే అవకాశం ఉంది. పద్నాలుగు రోజుల పాటు ఐజి లక్ష్మీ నారాయణ ఆధ్వర్యంలో 23 కంపెనీలను సిబిఐ ప్రశ్నించింది. పెట్టుబడులు ఎలా వచ్చాయి? జగన్ కంపెనీలలోనే పెట్టుబడులు ఎందుకు పెట్టారు? పెట్టుబడులు పెట్టిన కంపెనీలకు ఆ స్థోమత ఉందా? కంపెనీలు నిజమైనవేనా? తదితర అంశాలపై సిబిఐ పద్నాలుగు రోజుల పాటు అహోరాత్రులు శ్రమించి ప్రాథమిక నివేదికను తయారు చేసింది. మంగళవారం హైకోర్టుకు తమ నివేదికను సమర్పించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+