వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాల పుంతలో బయట పడ్డ మరో ‘రహస్యం’

|
Google Oneindia TeluguNews

Planetary Nebula
వాషింగ్టన్: పాలపుంతులో దాగి ఉన్న మరో రహస్యాన్ని శాస్త్రవేత్తలు చేధించారు. హైడ్రోజన్, హీలియం ఇతర వాయువులతో కూడిన కొత్త 'గ్రహ మండలా"న్ని అంతరిక్ష శాస్రవేత్తలు కొనుగొన్నారు. అమెరికాలోని కిట్ పీక్ జాతీయ పరిశోధన శాల నుంచి టెలిస్కోపులో పరిశీలిస్తుండగా ఈ కొత్త ప్లానెటరీ నెబ్యులాను సిడ్నీకి చెందిన మాక్వెరీ విశ్వవిద్యాలయ పరిశోధకులు గుర్తించారు. మన పాలపుంతలో ఇప్పటిదాకా 3 వేల ప్లానెటరీ నెబ్యులాలాను (కొత్త గ్రహ మండలలాను) శాస్త్రవేత్తలు కొనగొన్నట్లు పరిశోధన బృందం సారధి ఓర్సోనా డీ మార్కో తెలిపారు.

తమ పరిశోధనలో వెల్లడైన సమాచారంతోపాటు కెఫ్లర్ టెలిస్కోపు ద్వరా సేకరించే కచ్చితమైన సమాచారాన్ని బట్టి ప్లానెటరీ నెబ్యులాలు అద్భుతమైన రూపాలను ఎలా ఏర్పరుస్తున్నాయో తెలసుకోవచ్చని ఆమె అన్నారు. 30 ఏళ్లుగా నెబ్యులా ఆవిర్భావం గురించి పరిశోధకుల్లో మెదులుతున్న ప్రశ్నలకు సమాధానం లభించవచ్చని మార్కో ఆశాభావం వ్యక్తం చేశారు. నీలి రంగు ఫుట్ బాల్ ఆకారంలో ఉన్న ఈ కొత్త గ్రహ మండల రూపాన్ని జెమిని టెలిస్కోప్ ద్వరా చిత్రీకరించనట్లు పరిశోధకులు తెలిపారు.

English summary
While observing at the Kitt Peak National Observatory's 2.1 m telescope, the pair was asked to provide confirmation that the object known as Kn 61 was indeed a planetary nebula, as suspected.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X