వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యెడ్యూరప్ప అవుట్: సిఎం పీఠంపై ఈశ్వరప్ప, షెట్టార్?

By Srinivas
|
Google Oneindia TeluguNews

BS Yeddyurappa
న్యూఢిల్లీ: కర్నాటక ముఖ్యమంత్రి యెడ్యూరప్పకు భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఉద్వాసన పలిడానికి నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. లోకాయుక్త సంతోష్ హెగ్డే నివేదికలో కర్నాటక యెడ్యూరప్పు, గాలి జనార్దన్ రెడ్డి, జెడిఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామికి గనుల అక్రమాలలో పాత్ర ఉన్నట్లు నివేదిక బట్టబయలు అయిన విషయం తెలిసిందే. ఈ నివేదికలో యెడ్యూరప్పతో పాటు ఆయన కుమారుడు, అల్లుడి పాత్రలు కూడా ఉన్నట్లు నివేదికలో ఉన్నట్లు సమాచరం బహిర్గతమయింది. యెడ్డీపై తీవ్ర అవినీతి ఆరోపణలు రావడంతో ఆయనకు ఉద్వాసన పలకడానికే అధిష్టానం నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. జాతీయస్థాయిలో కాంగ్రెసు అవినీతిపై పోరాటం చేస్తున్న బిజెపి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న యెడ్యూరప్పను కొనసాగిస్తే ఫలితం ఉండదని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.

ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుండ బెట్టడానికి అధిష్టానం జగదీష్ షెట్టార్, ఈశ్వరప్ప పేర్లను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర పార్టీ కార్యవర్గంతో అధిష్టానం ఈ విషయంపై తీవ్రంగా చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. యెడ్డీ వ్యతిరేక వర్గం నేత అనంతకుమార్ సిఎం పీఠం కోసం తీవ్రంగా కృషి చేసినప్పటికీ యెడ్డీ ససేమీరా అన్నట్లుగా తెలుస్తోంది. సిఎంను మార్చాల్సి వస్తే తాను సూచించిన వ్యక్తినే పీఠంపై కూర్చుండ బెట్టాలని కూడా సూచించినట్లు తెలుస్తోంది. అంతకుముందు తాను పదవి నుండి దిగేది లేదని, కావాలంటే తనపై ఓ కమిటీ వేసుకోవచ్చునని ఏకంగా బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీకి లేఖ కూడా రాశారు. అయితే పార్టీ, ప్రభుత్వం భవిష్యత్తు దృష్ట్యా యెడ్డీకి ఉద్వాసన తప్పని పరిస్థితుల్లోనే అధిష్టానం మరో వ్యక్తి కోసం వెతుకులాట ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. షెట్టార్, ఈశ్వరప్పలలో ఎవరో ఒకరి పేరు త్వరలో ఖరారు చేస్తారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

English summary
BJP high command is thinking to call back CM Yeddyurappa and searching for new chief minister. The political analytics guessing Eshwarappa or Shettar is next CM?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X