134 రోజలు పస్తులున్నా, ఆ రెండు బతికాయంట..!

అయితే లోపలికి ప్రవేశించిన సిబ్బంది మాత్రం ఒక్క సారిగా కంగుతిన్నారు. అక్వేరియంలోని రెండు గోల్డ్ ఫిష్ చేపలు ఇంకా బతికే ఉండడం చూసి వారు ఆశ్చర్యానికి గురయ్యారు. అసలు విషయం ఏమిటంటే..? క్రైస్ట్ చర్చ్‌లోని క్వాంటమ్ చార్టర్డ్ అకౌంట్స్ భవనంలో ఓ అందమైన చేపల యక్వేరియం ఉండేది. అయితే భూకంపంలో ఇది ధ్వంసమై, దానిలో ఉన్న గోల్డ్ ఫిష్‌లు చనిపోయి ఉంటాయిని సిబ్బంది ఊహించారు..
ఎలాంటి ఆహారం లేకుండా, గాలి సమకూర్చేందుకు విద్యుత్ లేకుండా అవి నిక్షేపంగా ఉండడాన్ని వారు నమ్మలేకపోతున్నారు. బాక్టీరియా వల్ల అక్వేరియంలోని నిరు శుభ్రపడడంతో అవి బతకడానికి వీలు కలిగి ఉంటుందని, నాచువంటి పదార్థాలను తిని ఆ చేపలు బతికి ఉండవచ్చని కాలీఫోర్నియాకు చెందిన మాంటేరీ బే అక్వేరియం సంరక్షకుడు పౌల్ క్లార్క్సన్ అభిప్రాయపడ్డారు. అయితే అక్వేరియంలో ఉండాల్సిని మరి కొన్ని గోల్డ్ ఫిష్‌లు మాత్రం కనిపించటం లేదు.












Click it and Unblock the Notifications