వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
భేటీకి తెలంగాణ మంత్రులు డుమ్మా, డిసిఎం హాజరు

కాగా, తెలంగాణకు చెందిన మంత్రులు శ్రీధర్ బాబు, సారయ్య, ముఖేష్ గౌడ్, దానం నాగేందర్ సమావేశానికి గైర్హాజరయ్యారు. తాము ఈ సమావేశానికి హాజరు కాబోమని శ్రీధర్ బాబు, సారయ్య ముందే చెప్పారు. అధికారిక సమాచారం అందించనందు వల్ల ముఖేష్ గౌడ్ హాజరు కాలేదని తెలుస్తోంది. ఉద్యోగుల సమస్యలపై జ్యుడిషియల్ కమిషన్‌కు నివేదించినట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమావేశానంతరం మీడియా ప్రతినిధులకు చెప్పారు. తెలంగాణ ఉద్యోగుల సమ్మె నోటీసుపై మరోసారి చర్చిస్తామని ఆయన చెప్పారు. ఇదిలా పుంటే, ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్సి కూడా హాజరు కాలేదు.