మరో మధుకొడా గాలి జనార్దన్ రెడ్డి, లోకాయుక్త రిపోర్ట్?

అక్రమాలకు పాల్పడినట్లు భావిస్తున్న 215.12 కోట్ల రూపాయల విషయంలో ఐటి శాఖ దర్యాప్తు చేసి కచ్చితమైన నష్టాన్ని అంచనా వేసి, భారత్‌కు ఆ డబ్బును రప్పించే ఏర్పాట్లు చేయాలని నివేదిక సూచించింది. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఒఎంసి) నుంచి అక్రమంగా విదేశాలకు గాలి జనార్దన్ రెడ్డి, గాలి కరుణాకర్ రెడ్డి, మంత్రి శ్రీరాములు తరలించారని యువి సింగ్ నేతృత్వంలోని అధికారులు కనిపెట్టారు.
ఆ నివేదిక ప్రకారం - ఒఎంసి సింగపూర్‌లోని జిఎల్ఎ ట్రేడింగ్ ఇంటర్నేషనల్‌కు 20 కన్‌సైన్‌మెంట్లు పంపింది. ఇందులో ఎక్కువగా చైనాకు వెళ్లింది. జిఎల్ఎ 2007 నవంబర్ 30వ తేదీన ఏర్పడింది. ఈ కంపెనీ డైరెక్టర్లలో గాలి జనార్దన్ రెడ్డి కూడా ఒక్కరు. మిగతా కంపెనీల కన్నా ఒఎంసి సింగపూర్ కంపెనీకి తక్కువ ధరకు ఇనుప ఖనిజాన్ని ఎగుమతి చేసినట్లు బయటపడింది. ఆ విలువ 35 శాతం తక్కువగా ఉందని, ఇది కస్టమ్స్ చట్టానికి విరుద్ధమని అంటున్నారు.