వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
లోకాయుక్త ఏమిటో బయట పెడతా: గాలి

లోకాయుక్త జస్టిస్ సంతోష్ హెగ్డే తనపై నిరాధార ఆరోపణలు చేశారని రెవెన్యూ శాఖ మంత్రి గాలి కరుణాకరరెడ్డి ఆరోపించారు. తప్పుల నివేదిక తయారుచేసినందుకు లోకాయుక్త బహిరంగంగా ప్రజల క్షమాపణలు కోరాలని డిమాండ్ చేశారు. ఓబులాపురం గనుల కంపెనీ (ఓఎంసీ)కి తాను 2004లోనే రాజీనామా చేయగా దాన్ని బోర్డు డైరెక్టర్లు ఆమోదించిన విషయాన్ని ఆయన శుక్రవారం గుర్తు చేశారు. తాను 2007 నుంచి అక్రమ గనుల తవ్వకాలకు పాల్పడినట్లు నివేదికలో పేర్కొనడాన్ని తెలుసుకుని నిర్ఘాంతపోయాయనన్నారు. లోకాయుక్త నివేదికలో తన పేరును ఇరికించటం అన్యాయమంటూ గవర్నర్ భరద్వాజకు కరుణాకర రెడ్డి ఓ వినతి పత్రాన్ని అందజేశారు.