సిఎం కిరణ్ కుమార్‌కు తెలంగాణ మంత్రులు ఝలక్

నలుగురు మంత్రులు గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, శంకరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశానికి హాజరు కాలేదు. శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అన్ని పార్టీల శాసనసభ్యుల రాజీనామాలను తిరస్కరించిన నేపథ్యంలో, తెలంగాణ సమస్యపై పార్టీ అధిష్టానం చర్చలు ప్రారంభించిన నేపథ్యంలో విధులకు హాజరు కావాలని ముఖ్యమంత్రి తెలంగాణ మంత్రులకు సూచించారు. అయితే, అందుకు తెలంగాణ మంత్రులు అంగీకరించలేదు. ఉద్యమం తీవ్రమైన ప్రస్తుత తరుణంలో తాము విధులకు హాజరైతే తప్పుడు సంకేతాలు వెళ్తాయని, పార్టీకి నష్టం జరుగుతుందని వారు చెప్పారు. తాము ప్రజల్లోకి వెళ్లలేని స్థితిలో ఉన్నప్పుడు విధులకు హాజరు కావడం వల్ల ప్రయోజనం ఏమీ లేదని ఓ మంత్రి కచ్చితంగానే చెప్పినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications