చస్తానంటే కెసిఆర్‌ను చావనివ్వం: జెసి దివాకర్ రెడ్డి

కోదండరామ్ ముందు తన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ జీతం తీసుకుంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోదండరామ్ పని చేస్తున్నారని ఆయనపై వెంటనే ముఖ్యమంత్రి చర్య తీసుకోవాలని అన్నారు. తాను రాయల తెలంగాణ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. మంత్రివర్గ భేటీ జరగనంత మాత్రాన ఎలాంటి నష్టం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. అన్ని శాఖలు బాగానే పని చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో ఎలాంటి అనిశ్చితి లేదన్నారు. పాలన సజావుగానే సాగుతుందన్నారు. కొందరు మంత్రులు కార్యాలయాలకు రాకున్నా కొన్ని ఫైళ్లపై సంతకాలు చేస్తున్నారన్నారు. మంత్రులు హాజరు కాక పోయినా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఒక్కరే పరిపాలన సాగించగలరని అన్నారు.












Click it and Unblock the Notifications