హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిఎంను సవాల్ చేసిన కెసిఆర్ కూతురు కవిత

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kavitha
హైదరాబాద్: ముందుగా తన తమ్ముడి ఇళ్లు కూల్చిన తర్వాత మిగతా వారి ఇళ్లు కూల్చాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సిఎం కిరణ్ కుమార్ రెడ్డిని డిమాండ్ చేస్తూ సోమవారం అయ్యప్ప సొసైటీలోని ముఖ్యమంత్రి తమ్ముడి ఇంటి ముందు బైఠాయించారు. అయ్యప్ప సొసైటీలోని వివిఐపిల ఇళ్లను కూల్చకుండా కేవలం మధ్య తరగతి వారి ఇళ్లు కూల్చడమేమిటని ఆమె ప్రశ్నించారు. అధికారులు వెంటనే ఇక్కడ నుండి వెళ్లి పోవాలని డిమాండ్ చేశారు. కవిత ముఖ్యమంత్రికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిఎం తమ్ముడి ఇంటి ముందు బైఠాయించిన కవిత అక్కడి నుండి వెళ్లడానికి నిరాకరించడంతో పోలీసులు ఆమెను అరెస్టు చేసి మాదాపూర్ పోలీసు స్టేషన్‌కు తరలించారు.

కాగా సోమవారం ఉదయం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలోని పలు ఇళ్లు నిబంధనలకు విరుద్దంగా ఉన్నాయని తొలగిస్తున్నారు. అప్పటికే కొన్నింటిని తొలగించారు. అదే అయ్యప్ప సొసైటీలో సిఎం తమ్ముడి ఇళ్లు కూడా ఉంది. దానిని ముందుగా తొలగించాలని కవిత పట్టుబట్టారు. కాగా సొసైటీలోని ఇళ్లను కూల్చి వేయడాన్ని పలువురు బాధితులు ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్‌తో కలిసి వెళ్లి ముఖ్యమంత్రికి మొర పెట్టుకున్నారు. అక్రమ నిర్మాణాలపై హైకోర్టు పలుమార్లు జిహెచ్ఎంసి అధికారులకు పలుమార్లు మొట్టి కాయలు వేస్తోంది. హైకోర్టు మొట్టికాయలు వేసినప్పుడు మాత్రమే అధికారులలో చలనం వస్తుంది. ఆ తర్వాత మళ్లీ మామూలుగా మారిపోతోంది. కాగా అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలు తొలగించడాన్ని ఎవరూ అడ్డుకోకుండా ఉండటానికి అక్కడ భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ విధించారు.

English summary
Telangana Jagriti president Kalwakuntla Kavitha challenged CM Kiran Kumar Reddy today on dismantle of Ayyappa Society residences.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X