రామోజీరావును టార్గెట్ చేసిన వైయస్ జగన్ పార్టీ

రామోజీరావు ఆస్తులపై సిబిఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. రామోజీరావును ఆయన ఇంటలెక్చువల్ స్మగ్లర్‌గా ఆయన అభివర్ణించారు. శంషాబాద్ విమానాశ్రయం సమీపంలోని పాలమాకుల గ్రామంలో రామోజీరావు వక్రమార్గంలో 431 ఎకరాలు కొన్నారని ఆయన అన్నారు. అందుకు అప్పటి ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అండదండలున్నాయని ఆయన అన్నారు.
ఈనాడు ఉనికికి సాక్షి పెనుసవాలుగా నిలవడం తట్టుకోలేక వైయస్ జగన్‌పై, ఆయన ఆస్తులపై రామోజీ రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని గట్టు రామచందర్ రావు ఆరోపించారు. సిబిఐ విచారణకు రామోజీ రావు తనంతట తాను సిద్ధం కావాలని ఆయన అన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీ మొత్తం అవకతవకలమయమేనని ఆయన అన్నారు. లక్షల కోట్ల రూపాయలు రామోజీరావుకు ఎలా వచ్చాయో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications