వాదనల మీద వైయస్ జగన్ లాయరుపై హైకోర్టు ఆగ్రహం

చెప్పిన విషయాలే చెప్పి కోర్టు సమయాన్ని వృథా చేయవద్దని ఏం వినాలో తమకు తెలుసని మందలించినట్లుగా తెలుస్తోంది. మరో సమయంలో జగన్‌పై విచారణకు ఆదేశించాలంటే ముందు కంపెనీ ఎఫైర్స్ మినిస్ట్రీ నుండి రికార్డులు తెప్పించాలని జగన్ తరఫు న్యాయవాది కోర్టుకు సూచించారు. దీనిపై సిజె మండిపడ్డట్టుగా సమాచారం. తీర్పు మా పరిధిలోనిదని అది మాకు వదిలేయండని, మాకు కొన్ని ప్రివిలేజస్ ఉన్నాయని అన్నట్టుగా తెలుస్తోంది. సుప్రీం కోర్టుకు వెళ్లి వచ్చినంత మాతార్న మీరే సుప్రీంగా అనుకోవద్దని కూడా సిజె మందలించినట్లుగా తెలుస్తోంది. కాగా తమ వాదనలు వినిపించడానికి మరో రోజు ఇవ్వాలని జగన్ తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేయగా దానిని తోసి పుచ్చారు. కాగా టిడిపి ఫిర్యాదుపై వాదనలు బుధవారం ముగిశాయి. షేర్వాణి పిటిషన్‌పై గురువారం వాదనలు జరగనున్నాయి.












Click it and Unblock the Notifications