గాలి, జగన్‌లను జె గ్యాంగ్‌గా అభివర్ణించిన రేవంత్

Revanth Reddy
హైదరాబాద్: డి గ్యాంగ్ అంతర్జాతీయ నేరాలకు పాల్పడుతుంటే జె గ్యాంగ్ అంతర్ రాష్ట్ర అవినీతికి పాల్పడుతోందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బుధవారం ఎన్టీఆర్ ట్రస్టు భవనంలో వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, కర్నాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డిని ఉద్దేశించి మీడియా సమావేశంలో విమర్శించారు. వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సాక్షి అక్రమాల పుట్ట అని విమర్శించారు. అక్రమ పెట్టుబడులతో పుట్టిన సాక్షికి ఇతరులను విమర్శించే హక్కు లేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి నిర్ణయాల వల్ల వేల కోట్ల అక్రమ మైనింగ్ మన రాష్ట్రంలో జరిగిందని ఆరోపించారు.

ఈ ప్రత్యక్ష దోపిడీలో జగన్‌కు సైతం సంబంధం ఉందని ఆరోపించారు. అక్రమ మైనింగ్‌పై సిబిఐతో పూర్తిస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మన రాష్ట్ర ప్రభుత్వం కర్నాటక లోకాయుక్త నివేదికను పరిశీలించాలని సూచించారు. అక్రమ మైనింగ్ ఎలా జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆంధ్రా మైనింగ్ వల్ల కోట్లు సంపాదించారని అన్నారు. ఆర్ఆర్ గ్లోబల్ అక్రమ మైనింగుకు పాల్పడిందన్నారు. కర్నాటకలో గనులు కొల్లగొట్టి జగన్‌కు చెందిన జగతి కంపెనీలలో పెట్టుబడులు పెట్టారని ఆరోపించారు. కర్నాటక అక్రమ ఖనిజాన్ని విదేశాలకు తరలించారని అన్నారు. ఎపిలో కర్నాటక అక్రమ మైనింగ్ మూలాలు ఉన్నాయన్నారు. బలపనూరులో భోజనాలు లేని వైయస్ కుటుంబం బెంగళూరులో బంగ్లాలు ఎలా కట్టిందన్నారు.

కాగా సీనియర్లపై తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సీరియస్ అవుతున్నారని సాక్షి తప్పుడు కథనాలు ప్రచురిస్తుందని మరో నేత వర్ల రామయ్య అన్నారు. తెలుగుదేశం పార్టీ మేథోమథనంపై అవాస్తవాలు ప్రచురిస్తోందన్నారు. ఇలాంటి నీతిమాలిన చర్యలు మానుకోవాలని సూచించారు. సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతూ దురుద్దేశ్యంతో టిడిపిపై దుష్ప్రచారం చేస్తుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+