తెలంగాణ ఆత్మహత్యలపై సుష్మా స్వరాజ్ కలత

కాగా తెలంగాణ విషయంపై ఈ ప్రాంతంలో ప్రజాభిప్రాయ సేకరణ జరగాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి శనివారం హైదరాబాదులో అన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై ఓ నిర్ణయం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలన్నారు. తెలంగాణపై మరోసారి ఏకాభిప్రాయం అవసరమంటూ కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రకటించడం ఇచ్చిన మాట వెనక్కి తీసుకోవటమే అన్నారు. బిజెపిని విమర్శించే నైతిక హక్కు ఎంపీ కావూరి సాంబశివ రావుకు లేదన్నారు. 14ఎఫ్ రద్దు చేశాకే ఎస్సై పరీక్షలు నిర్వహించాలని ఆన డిమాండ్ చేశారు. ఎస్మా, పోలీసు నిబంధనలతో సకల జనుల సమ్మెను ఆపాలనుకోవడం అవివేకమన్నారు.












Click it and Unblock the Notifications