తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పరిష్కారంలో ముందుంటా: పిఆర్పీ చీఫ్ చిరంజీవి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
తిరుపతి: సమస్యల పరిష్కరించడానికి తాను ముందుంటానని ప్రజారాజ్యం పార్టీ అధినేత, తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి బుధవారం తిరుపతి పట్టణ టాక్సీ డ్రైవర్లకు భరోసా ఇచ్చారు. టాక్సీ డ్రైవర్లు తొందరపడి ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడకూడదని వారిని కోరారు. సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు. ఆగ్రహంతో, అఘాయిత్యాలతో కాకుండా సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుందామని సూచించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఇవో సుబ్రహ్మణ్యానికి చిరంజీవి ఫోన్ చేసి టాక్సీ డ్రైవర్ల సమస్యపై చర్చించినట్లుగా తెలుస్తోంది.

కాగా అంతకుముందు ఉదయం నుండి ప్రయివేటు వాహనాలను తిరుమల కొండ పైకి అనుమతించాలని డిమాండ్ చేస్తూ టాక్సీ డ్రైవర్లు అలిపిరి వద్ద ఆందోళనకు దిగారు. భారీగా డ్రైవర్లు వచ్చి ఆందోళన బాట పట్టారు. కొండ పైకి వెళుతున్న బస్సులను అడ్డుకున్నారు. పైకి వెళుతున్న వాహనాలపై రాళ్లు విసిరి తమ నిరసన తెలిపారు. ఓ డ్రైవర్ గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు డ్రైవర్లపై లాఠీచార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. మరికొందరిని అరెస్టు చేశారు.

English summary
PRP president, Tirupati mla Chiranjeevi respond on Tirumala taxi drivers issue. He phoned to TTD EO Suhbrahmanyam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X