ఏఐఏడీఎంకే ఓట్లన్నీ విజయ్ కే- ఇది తథ్యం: తేల్చిన టాప్ ఎగ్జిట్ పోల్స్
తాజాగా ముగిసిన నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతానికి నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడటం ఆరంభమైంది. పశ్చిమ బెంగాల్‌లో చివరిదశ పోలింగ్ ముగిసిన అరగంట తరువాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడవుతున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన మీడియా హౌస్‌లు, ఎన్నికల సర్వేల ఫలితాలను వెల్లడిస్తున్నాయి. అందరి కళ్లూ ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైనే ఉన్నాయి.
ఈ పరిణామాల మధ్య అసెంబ్లీ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్ సంస్థలు తమ అంచనా వెల్లడిస్తోన్నాయి. ప్రత్యేకించి ఈ ఎన్నికల్లో మాస్ హీరో విజయ్ ఎంట్రీ ఇస్తోండటంతో అంచనాలు మారిపోతున్నాయి. తలకిందులు అవుతున్నాయి. స్టాలిన్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఎన్డీటీవీ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది.

తాజాగా సివిక్ పోల్ అనాలసిస్ కమిటీ (సీప్యాక్) తమిళనాడు అసెంబ్లీపై తన అంచనాలను విడుదల చేసింది. ఈ సర్వే ప్రకారం చూస్తే మొత్తం 234 మంది సభ్యులు ఉన్న తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో డీఎంకే ప్రభంజన కనిపించింది. ముఖ్యమంత్రి స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే వరుసగా రెండోసారి అధికారంలోకి రావడం ఖాయమైంది. తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటుంది. 2021లో జరిగిన ఎన్నికల మాదిరిగానే పట్టును నిలుపుకొంటుంది.
నాటి ఎన్నికల్లో డీఎంకే- కాంగ్రెస్ కూటమి స్వీపింగ్ విక్టరీ సాధించిన విషయం తెలిసిందే. డీఎంకే సొంతంగా 133 సీట్లు సాధించింది. మొత్తంగా కూటమి 159 సీట్లు గెలుచుకుని స్టాలిన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు అప్పట్లో. ఇప్పుడు కూడా అదే స్థాయిలో సీట్లను డీఎంకే కూటమి దక్కించుకుంటుందని సీప్యాక్ అంచనావేసింది. డీఎంకే కూటమికి మొత్తంగా 128 సీట్లు లభిస్తాయని పేర్కొంది.
#TNEXITPOLLS2026#DMK #TVKVijay#AIADMK#CIVICPOLL..@SumanTvOfficial pic.twitter.com/si1JE7z0EE
— C-PAC (@CIVICPOLL) April 29, 2026
ఏఐఏడీఎంకే ఓట్లన్నింటినీ కూడా విజయ్ తన్నుకుపోయే అవకాశాలు ఉన్నట్లు సీప్యాక్ అభిప్రాయపడింది. ఏకంగా టీవీకే 98 సీట్లను గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడంతో పాటు ఏఐఏడీఎంకే ఓటు బ్యాంక్ ను కూడా టీవీకే తీవ్రంగా ప్రభావితం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. వ్యతిరేక ఓటు అన్నాడీఎంకేకు బదులుగా టీవీకే వైపు మొగ్గు చూపడం ఈ సర్వేలో హైలైట్ గా చెప్పుకోవచ్చు.












Click it and Unblock the Notifications