కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ మాట బేఖాతరు, బందుకు వైయస్సార్సీ మద్దతు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Karimnagar District
కరీంనగర్: వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు ఆ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటన బేఖాతరు చేసినట్లుగా కనిపిస్తోంది. 14ఎఫ్ రద్దు కోరుతూ తెలంగాణ విద్యార్థి ఐక్య కార్యాచరణ సమితి ఇచ్చిన బందు కార్యక్రమంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ అయిన వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ సైతం మద్దతు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కరీంనగర్ పట్టణ కేంద్రంలో విద్యార్థి జెఏసికి మద్దతుగా వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ నేతలు బందు కార్యక్రమంలో పాల్గొన్నారు. బందుకు మద్దతుగా వైయస్సాఆర్ కాంగ్రెసు భారీ బైక్ ర్యాలీ నిర్వహించింది. జై తెలంగాణ అంటూ నినాదాలు చేసింది.

కాగా ఇటీవల జరిగిన ప్లీనరీలో జగన్ తాము అటు తెలంగాణ వాదాన్ని, ఇటు సమైక్యవాదాన్ని ఏ వాదాన్ని బలపర్చమని న్యూట్రల్‌గా ఉంటామని ప్రకటించారు. తెలంగాణ అంశం కేంద్రం పరిధిలో ఉన్నదని, తాము తెలంగాణ ఇచ్చే పరిస్థితుల్లో లేము, తెచ్చే పరిస్థితుల్లో లేనందున తాము ఏమీ చెప్పలేమని చెప్పారు. తెలంగాణ, సమైక్యవాద ఉద్యమాల్లో పాలు పంచుకోమని చెప్పారు. అయితే కరీంనగర్ జిల్లా కార్యకర్తలు మాత్రం బందుకు మద్దతు ఇవ్వడం గమనార్హం. కాగా బందు సందర్భంగా జిల్లాలోని పదకొండు డిపోల్లోని బస్సులు నిలిచి పోయాయి. హుజురాబాద్ డిపోకు తెలంగాణవాదులు తాళాలు వేశారు.

English summary
YSRC party activist take a bike rally with supporting Telangana Student JAC telangana bandh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X