రామ్ చరణ్ తేజ్ పెళ్లికి తొందరేమీ లేదు: చిరంజీవి

Chiranjeevi
తిరుపతి: తన కుమారుడు, సినీ హీరో రామ్ చరణ్ తేజ్ పెళ్లికి తొందరేమీ లేదని తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి అన్నారు. తిరుమలలో ఆటో రిక్షా డ్రైవర్లు ఆందోళనకు దిగిన నేపథ్యంలో సమస్య పరిష్కారానికి ఆయన గురువారం సాయంత్రం హుటాహుటిన హైదరాబాదు నుంచి బయలుదేరి తిరుపతికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రామ్ చరణ్ తేజ్ పెళ్లి విషయాలు వ్యక్తిగతంగా చెప్తానని ఆయన అన్నారు.

ఆటో డ్రైవర్ల సమస్యపై తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. ఆటో రిక్షా డ్రైవర్లకు అనుకూలమైన నిర్ణయం తీసుకోవాలని ఆయన టిటిడి అధికారులను డిమాండ్ చేశారు. తిరుమల జెఇవో రాజకీయ ప్రతినిధుల పట్ల వ్యవహరించిన తీరు సమంజసంగా లేదని ఆయన అన్నారు. తాను ఈ నెల 20వ తేదీన రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెసులో చేరుతున్నట్లు ఆయన తెలిపారు. తమ ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు, ముఖ్యనేతలు 22వ తేదీన హైదరాబాదులో కాంగ్రెసులో చేరుతారని ఆయన చెప్పారు.

తిరుమలకు తమను అనుమతించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన ఆటో రిక్షా డ్రైవర్లపై గురువారం పోలీసులు లాఠీచార్జీ చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జాయింట్ ఎగ్జిక్యూటివ్ అధికారి కార్యాలయాన్ని ముట్టడించడానికి వారు ప్రయత్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+