తెలంగాణలో ప్రతి పౌరుడూ పాండవుడే: దానం నాగేందర్

danam Nagender
హైదరాబాద్: తెలంగాణలో ప్రతి ఒక్క పౌరుడు పాండవుడేనని మంత్రి దానం నాగేందర్ అన్నారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల సమ్మె నోటీసుపై మంత్రి వర్గ ఉపసంఘం చర్చలు జరిపిన తర్వాత ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సమ్మె నోటీసు ఉపసంహరించుకుంటే ఉద్యోగులపై ఎస్మా ప్రయోగం ఉండదని ఆయన అన్నారు. సమ్మె చేస్తే ఎస్మా ప్రయోగం తప్పదనే సూచనను ఆయన ఈ సందర్భంగా ఆయన అందించారు.

ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంత్రి వర్గ ఉపసంఘం చర్చలు సామరస్య పూర్వకంగా జరిగాయని ఆయన చెప్పారు. ఉద్యోగులపై ప్రభుత్వం ఏ విధమైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడదని ఆయన అన్నారు. కాగా, సమ్మెపై ఈ నెల 16వ తేదీన నిర్ణయం తీసుకుంటామని ఉద్యోగ సంఘాల నాయకులు చెప్పారు. ముస్లిం, హిందువుల మనోభావాలను గౌరవించాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ చెప్పారు. ఆ విషయాలను దృష్టిలో పెట్టుకునే సకల జనుల సమ్మె జరుగుతుందని ఆయన అన్నారు. 17వ తేదీననే సకల జనుల సమ్మె సాగుతుందని ఆయన అన్నారు. దీన్ని రెండు దశలుగా కొనసాగిస్తామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+