హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టింది వీరే

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: సిబిఐ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశించడంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినవారి గుండెల్లో కూడా రైళ్లు పెరిగెత్తుతున్నాయి. ప్రభుత్వం నుంచి లాభాలు పొందినవారే జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన ప్రముఖులు ఎవరు, వారు ప్రభుత్వం నుంచి పొందిన లాభాలు ఏమిటని ఓ ప్రముఖ దినపత్రిక క్రోడీకరించి ఇచ్చింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి -

1. నిమ్మగడ్డ ప్రసాద్‌ పెట్టుబడులు
సాక్షిలో... రూ.450 కోట్లు
భారతీ సిమెంట్స్‌లో... రూ.252 కోట్లు
కార్మెల్‌ ఏషియాలో... రూ.20 కోట్లు
పొందిన ప్రయోజనం: గుంటూరు , ప్రకాశం జిల్లాల్లో ఓడరేవు, నిజాంపట్నం పోర్టులు, పారిశ్రామిక కారిడార్‌ (వాన్‌పిక్‌) పేరుతో 16000 ఎకరాల భూములు

2. పొట్లూరి వరప్రసాద్‌ పెట్టుబడి
సాక్షిలో... రూ.147 కోట్లు
పొందిన ప్రయోజనం:
వైఎస్‌ సర్కారు అండతో హైదరాబాద్‌ శివారులోని నాదర్‌గుల్‌లో ప్రభుత్వ, అసైన్డ్‌ భూములను ప్రైవేటు వ్యక్తులు సొంతం చేసుకున్న కుంభకోణంలో ఈయన ప్రధాన లబ్ధిదారుడనే అభియోగం ఉంది.

3. ఇండియా సిమెంట్స్‌ పెట్టుబడులు
భారతీ సిమెంట్స్‌లో... రూ.95 కోట్లు
సాక్షిలో... రూ.40 కోట్లు
కార్మెల్‌లో... రూ.5 కోట్లు
పొందిన ప్రయోజనం : సిమెంట్‌ కర్మాగారాలకు నీళ్లు చాలా అవసరం ఈ సంస్థ కర్మాగారాలకు నీళ్ల కేటాయింపులను వైఎస్‌ సర్కారు ధారాళంగా పెంచింది.

4. దాల్మియా సిమెంట్స్‌
భారతీ సిమెంట్స్‌లో... రూ.95 కోట్లు
పొందిన ప్రయోజనం: కడప జిల్లాలో 407 హెక్టార్ల సున్నపు రాయి భూములను తమ మనుషులకు సంబంధించిన ఈశ్వరీ అనే సంస్థ పేరుతో వైఎస్‌ సర్కారు కేటాయించింది. తర్వాత వాటిని దాల్మియా పరం చేసింది.

5. పయనీర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ హోల్డింగ్‌
(పెన్నా ప్రతాపరెడ్డి పెట్టుబడి)
సాక్షిలో... రూ.40 కోట్లు
కార్మెల్‌ ఏషియాలో... రూ.23 కోట్లు
పొందిన ప్రయోజనం : విశాఖ జిల్లాలో రస్‌ అల్‌ ఖైమా పేరుతో భారీ ఎత్తున బాక్సైట్‌ నిక్షేపాలను ప్రభుత్వం కేటాయించింది. ఆ సంస్థలో భాగస్వామిగా అల్యూమినియం కర్మాగారం నిర్మిస్తున్నది ప్రతాపరెడ్డే.

6. జుబ్లీమీడియా కమ్యూనికేషన్స్‌ పెట్టుబడి
సాక్షిలో... రూ.30కోట్లు
కార్మెల్‌లో... రూ.10 కోట్లు
పొందిన ప్రయోజనం: ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ సోదరుడు శ్రీధర్‌ సొంత సంస్థ ఇది. ఆయనకు సంబంధించిన ల్యాంకో గ్రూపునకు వైఎస్‌ సర్కారు హైదరాబాద్‌లో కేటాయించిన ప్రాజెక్టు, దానికి ఇచ్చిన రాయితీల విషయంలో శాసనసభలోనూ ఎన్నో ఆరోపణలు వచ్చాయి. బాసర ట్రిపుల్‌ ఐటీ నిర్మాణ కాంట్రాక్టునూ దానికే ఇచ్చారు.

7. ఆర్‌.ఆర్‌.గ్లోబల్‌
సాక్షిలో... రూ.49 కోట్లు
ఇందిరా టెలివిజన్‌లో... రూ.30 కోట్లు
పొందిన ప్రయోజనం : సాక్షి ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ రామకృష్ణారెడ్డి సోదరుడు దివాకరరెడ్డి ఏర్పాటు చేసిన సంస్థ ఇది. వైఎస్‌ హయాంలో ఓబులాపురం గనుల్లో అక్రమాలకు పాల్పడ్డ మహాబలేశ్వరప్ప కంపెనీ నుంచి కారుచౌకగా ఇనపఖనిజం పొంది.. దాని ద్వారా వచ్చిన డబ్బులో సింహభాగాన్ని జగన్‌ సంస్థలకు మళ్లించారు.

8. హెటిరో సంస్థలు
సాక్షిలో... రూ.4 కోట్లు
పొందిన ప్రయోజనం: పోలేపల్లి సెజ్‌లో 70 ఎకరాల భూమి
కంపెనీల మాయాజాలం: సాక్షిలోకి దాదాపు రూ.164 కోట్లను పెట్టుబడిగా తరలించిన 24 కంపెనీల పేర్లతో ఉన్న వాటాలన్నింటినీ (షేర్లు) కొద్దిరోజుల కిందట మరో మూడు కంపెనీల పేర్ల మీదకు మార్చారు. 17 కంపెనీల పేరుతో ఉన్న రూ.96 కోట్ల విలువైన షేర్లను ఐఏఅండ్‌ఐసీ అనే పేరు మీదకు మార్చారు. అవంత్‌ గ్రేడ్‌ ఫ్యాషన్‌వేర్‌ అనే కంపెనీకి రెండు సంస్థల నుంచి రూ.59.7 కోట్ల విలువైన షేర్లు, షాప్రతాప్‌ ఇండస్ట్రీస్‌కు అయిదు కంపెనీల నుంచి రూ.8.93 కోట్ల విలువైన షేర్లను మార్చారు. ఇలా షేర్లు బదిలీ అయిన కంపెనీలన్నీ కూడా తూతూమంత్రపు సంస్థలే కావడం గమనార్హం.

English summary
According to a daily news papers the list of the prominent persons, who invested in YS Jagan's companies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X