చర్చలకు రావడానికి వీలు కాదు: తెలంగాణ ఉద్యోగులు

ఉద్యోగ సంఘాలపై తుపాకి ఎక్కుపెట్టి చర్చలకు రమ్మంటే ఎలా అని ప్రశ్నించారు. పోలీసులు ఉద్యోగుల ఇళ్లలోకి వెళ్లి బెదిరింపులకు గురి చేస్తున్నారని అన్నారు. ఉద్యోగుల ఫోన్లు ట్యాపింగు చేస్తున్నారని ఆరోపించారు. సమ్మె వాయిదా వేయాలని ప్రభుత్వం కోరుతుందని దానిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఉద్యోగుల సమ్మెను విరమింపచేయడానికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. ఎపిఎన్జీవోతో తెగతెంపులు చేసుకుంటున్నట్టు చెప్పారు. సమైక్య తీర్మానం చేసినందునే వారితో కలవవద్దని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. భవిష్యత్తులో ఎపిఎన్జీవో నిర్వహించే ఏ సభలకు వెళ్లమని అన్నారు.












Click it and Unblock the Notifications