దటీజ్ చిరంజీవి: ఫలించిన మెగాస్టార్ దౌత్యం

కొండ పైకి వెళ్లే బస్సులను అడ్డుకున్నారు. అయితే పోలీసులు వారిపై లాఠీఛార్జ్ చేసి చెదరగొట్టారు. అయినప్పటికీ వారు తగ్గలేదు. ట్యాక్సీ డ్రైవర్లపై లాఠీఛార్జి జరిగిందని తెలిసిన చిరంజీవి టిటిడి అధికారితో ఫోన్‌లో మాట్లాడారు. శుక్రవారం హుటాహుటిన తిరుపతి బయలు దేరారు. ఇటు ట్యాక్సీ డ్రైవర్లతో అటు టిటిడి అధికారులతో చర్చించారు. సమస్య పరిష్కరిస్తానని చిరు డ్రైవర్లకు హామీ ఇచ్చారు. చిరంజీవి మాట ఇచ్చినందు వల్ల ట్యాక్సీ డ్రైవర్లు శుక్రవారం నాటి ఆందోళనను వాయిదా వేసుకున్నారు. ఇంతలో చిరంజీవి సిఎం కిరణ్ కుమార్ రెడ్డి, టిటిడి అధికారులతో దౌత్యం నెరపి ప్రస్తుతానికి సమస్యను పరిష్కరించారు.












Click it and Unblock the Notifications