జగన్‌తో తేల్చుకో: లగడపాటికి గోనె హెచ్చరిక

Gone Prakash Rao
హైదరాబాద్: వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై అసూయ ఉన్నా, ఆయనతో భేదాభిప్రాయాలు ఉన్నా ఆయనతోనే తేల్చుకోవాలని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌కు వైయస్సాఆర్ పార్టీ నేత గోనె ప్రకాశ రావు శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింటు వద్ద హెచ్చరించారు. అనవసరంగా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిపై నిందలు వేస్తూ ఆయన ఇమేజ్ దెబ్బతీసే ప్రయత్నాలు చేయవద్దని అన్నారు. లగడపాటి అవాకులు చవాకులు పేలవద్దని హెచ్చరించారు.

ఎవరి మద్దతు లేకుండా కాంగ్రెసు పార్టీ అధిష్టానం రోశయ్యను, కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుండ బెట్టడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. కాగా ఎమ్మార్ అక్రమాలపై ముందుగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును విచారించాలని వైయస్సాఆర్సీ పార్టీ నేత సిఎన్వీ ప్రసాద్ వేరుగా అన్నారు. 2002లో చంద్రబాబు ఎమ్మార్‌కు భూమి కేటాయించారని అన్నారు. టిడిపి హయాంలోని ఎమ్మార్ అంశాలపై సిబిఐ దృష్టి సారించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+