వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'అప్పుడు వైయస్ఆర్ తనయుడు జగన్‌పై కక్ష కట్టారా?'

By Srinivas
|
Google Oneindia TeluguNews

Tulasi Reddy
హైదరాబాద్: సిబిఐ దర్యాఫ్తు విషయంలో వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై దివంగత ముఖ్యమంత్రి, ఆయన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి సైతం కక్ష కట్టినట్లేనా అని ఆరు సూత్రాల కమిటీ చైర్మన్ తులసీ రెడ్డి శనివారం ప్రశ్నించారు. జగన్ ఆస్తులపై సిబిఐ దర్యాఫ్తు వెనుక కుట్ర అనడం సరికాదన్నారు. జగన్ ఆస్తులపై కుట్ర పూరితం అంటున్న వారు గతంలో తెలుగుదేశం పార్టీ నేత పరిటాల రవి హత్య జరిగిందని అందులో జగన్ హస్తం ఉందన్న ఆరోపణలు వచ్చినప్పుడు తన తనయుడు అని చూడకుండా సిబిఐ విచారణకు ఆదేశించారని అన్నారు.

అలా అంటే అప్పుడు వైయస్ రాజశేఖర రెడ్డి తన తనయుడిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడినట్లేనా అని ప్రశ్నించారు. జగన్ సిబిఐ విచారణకు సహకరించి తన నిజాయితీ నిరూపించుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పాలన రాష్ట్రానికి ఆశాకిరణం అని ఆయన అన్నారు. రాష్ట్రం అన్ని రంగాలలో ముందంజలో వెళుతుందన్నారు.

English summary
Congess senior leader Tulasi Reddy questioned YSRC party leaders about late YSR's cbi enquiry on YS Jagan in Paritala Ravi murder case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X