టిడిపి ఎమ్మెల్యే సోదరుడి కోడలు దారుణ హత్య

గిరిజ రోజూ మధ్యాహ్నం 2 గంటలకు భర్తకు భోజనం తీసుకెళ్లి ఇచ్చేవారు. శనివారం సాయంత్రం వరకు ఆమె రాకపోవడంతో భర్తే ఇంటికి వెళ్లారు. అక్కడ నిర్జీవంగా ఉన్న గిరిజను చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. సమాచారం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వరరావు హైదరాబాద్‌లో ఉన్న రాజా కూతుళ్లను వెంట తీసుకొని షిర్డీ బయల్దేరారు. ఈ ఘటనతో ధర్మారంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్వగ్రామంలో జరిగే శుభకార్యాలకు రాజా దంపతులు తప్పనిసరిగా హాజరయ్యేవారని, ఇటీవల జరిగిన పాఠశాల స్వర్ణోత్సవాలకు కూడా వచ్చారని స్థానికులు తెలిపారు. గిరిజ మృతదేహానికి ధర్మారంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.


Click it and Unblock the Notifications