వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దుష్ట శక్తులను ఎదుర్కొనేందుకు పని చేయాలి: బొత్స

By Srinivas
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్: రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే దుష్టశక్తులను ఎదుర్కొనేందుకు అందరం కలిసి పని చేయాలని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సోమవారం పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బొత్స పార్టీ కార్యాలయం గాంధీ భవనంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్వాతంత్ర్యం తెచ్చి పెట్టిన నాయకుల త్యాగాలు మనం మరిచి పోవద్దని సూచించారు. ఈ కార్యక్రమానికి పలువురు ఎమ్మెల్యేలు, నేతలు హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవనంలో ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అన్నా హజారేను అవినీతిపరుడిగా చిత్రీకరించడం బాధాకరం అన్నారు. లోకాయుక్త, కోర్టులే అవినీతిపై స్పందిస్తున్నాయని, ప్రభుత్వాలు మాత్రం నిర్లిప్తంగా ఉన్నాయని ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. సీనియర్ నేతలు బండారు దత్తాత్రేయ, సిహెచ్ విద్యాసాగర రావు, నల్లు ఇంద్రసేనా రెడ్డి తదితరులు హాజరు అయ్యారు. కరీంనగర్‌లో ఎంపీ పొన్నం ప్రభాకర్ జాతీయ జెండాతో పాటు తెలంగాణ జెండాను ఆవిష్కరించారు. వైయస్సాఆర్సీ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి జెండాను ఆవిష్కరించారు. సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో నారాయణ, టిఆర్ఎస్ కార్యాలయంలో నాయిని నరసింహా రెడ్డి ఎగురవేశారు.

English summary
PCC chief Botsa Satyanarayana called party followers to fight for state and counrty development.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X