'తెలంగాణ తరహా త్వరలో జై ఆంధ్ర ఉద్యమం'

జాతీయ స్థాయిలో అవినీతిపై పోరాటం చేస్తున్న సామాజిక సంస్కర్త అన్నా హజారే ఉద్యమానికి జెఏసి మద్దతు ఉంటుందని కోదండరామ్ ప్రకటించారు. తెలంగాణ పోరాటం, అవినీతిపై అన్నా హజారే చేస్తున్న పోరాటం నాణేనికి రెండు పార్శ్వాలు అన్నారు. కాగా తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న సీమాంధ్ర సెటిలర్స్ చైతన్య యాత్ర సోమవారం జెఏసి కార్యాలయానికి చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమైక్యాంధ్ర నినాదం పాలకులది మాత్రమే అన్నారు. అక్కడి ప్రజలు సైతం విడిపోయి అభివృద్ధి చెందుతామన్న భావనతో ఉన్నారని అన్నారు. త్వరలో అక్కడ జై ఆంధ్రా ఉద్యమం పుట్టుకు వస్తుందని వారు అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications