వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ, జాతీయ జెండాలతో అసెంబ్లీలో నాగం హల్‌చల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nagam Janardhan Reddy
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ బహిష్కృత శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి సోమవారం 65వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అసెంబ్లీలో జాతీయ జెండా, తెలంగాణ జెండాలతో హల్ చల్ చేశారు. ఓ భుజంపై జాతీయ జెండాను, మరో భుజంపై తెలంగాణ జెండాను ఉంచుకొని అసెంబ్లీకి వచ్చారు. అక్కడి నుండి స్పీకర్ కార్యాలయానికి చేరుకొని తమ రాజీనామాలు ఆమోదించాల్సిందిగా ఆయన సభాపతి నాదెండ్ల మనోహర్‌ను కోరారు. అందుకు నాదెండ్ల మంగళవారం చర్చించి నిర్ణయం తీసుకుంటానని నాగం జనార్దన్ రెడ్డికి హామీ ఇచ్చారు.

ఆ తర్వాత అసెంబ్లీ మీడియా పాయింటు వద్ద ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక రాష్ట్రాన్ని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధులు మరోసారి రాజీనామా చేసి తమ రాజీనామాలు ఆమోదింప జేసుకోవాలని డిమాండ్ చేశారు. తాము సైతం రాజీనామాలు ఆమోదింప చేసుకుంటామని అన్నారు. స్పీకరు రాజీనామాలను ఆమోదించాలని ఆయన డిమాండ్ చేశారు. అంతకుముందు అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ నాదెండ్ల జెండాను ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణలో నాగం పాల్గొన్నారు. ఆవిష్కరణ, జాతీయ గీతం అనంతరం నాగం జై తెలంగాణ, జై భరత్ మాత అంటూ నినాదాలు చేశారు.

English summary
TDP suspended MLA Nagam Janardhan Reddy created hulchul at Assembly today with National and Telangana flags. He met speaker Nadendla Manohar and urged to accept their resignations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X