జగన్‌కు సుప్రీంకు వెళ్లేంత భయమెందుకు?: రాయపాటి

Rayapati Sambasiva Rao
గుంటూరు: వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన ఆస్తులపై సిబిఐ దర్యాఫ్తు చేస్తే భయపడాల్సిన అవసరం ఏముందని గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు సోమవారం అన్నారు. తప్పులు చేయనప్పుడు సిబిఐ దర్యాఫ్తు చేసినప్పుడు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. సిబిఐ విచారణలో జగన్ తన సచ్ఛీలత నిరూపించుకోవాలని సూచించారు. సిబిఐ ప్రాథమిక విచారణపై సుప్రీం కోర్టుకు వెళ్లినట్లుగా మళ్లీ జగన్ పూర్తి విచారణపై సుప్రీం కోర్టుకు వెళ్లవద్దని సూచించారు.

వైయస్ జగన్ పొత్తుపై ఇప్పటి వరకు ఏ పార్టీ గురించి చెప్పలేదన్నారు. అలాంటప్పుడు పొత్తులపై మాట్లాడాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. అయినా ఇంత తొందరగా పొత్తులపై మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. దేశంలో అవినీతి తీవ్రస్థాయికి చేరిందని ఆయన అన్నారు. అవినీతిని అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+