జగన్ వ్యాఖ్యలను కొట్టిపారేసిన సల్మాన్ ఖుర్షీద్

Salman Khurshid
న్యూఢిల్లీ: తనను వేధిస్తున్నారంటూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యను కేంద్ర న్యాయశాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ కొట్టిపారేశారు. కోర్టు ఆదేశాల మేరకే అన్ని విషయాలు జరిగాయని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఏది జరిగిన కోర్టు ఆదేశాల మేరకే జరిగిందని, తామేమీ చేయలేదని, తాము కోర్టు ధిక్కారాన్ని ఎదుర్కోదలుచుకోలేదని ఆయన అన్నారు.

కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ)కి పూర్తి స్వయం ప్రతిపత్తి ఉందని ఆయన చెప్పారు. అందువల్ల కోర్టు నుంచి సిబిఐకి ఆదేశాలు వెళ్లాయని, సిబిఐ చేసే దర్యాప్తును కోర్టు పర్యవేక్షిస్తుందని ఆయన చెప్పారు. తాము తెర మీదికి వచ్చే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. కాంగ్రెసును వీడడం వల్లనే తనపై వేధింపు చర్యలకు దిగుతున్నారని జగన్ సోమవారం ఉదయం ఆరోపించిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+